ఈ సారి ఐపీఎల్ కప్ వారిదేనట…

ఈ సారి ఐపీఎల్ కప్ వారిదేనట...

0
112

గతేడాది జరిగిన ఐపీఎల్ కప్ ను ముంబై ఇండియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే… చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబై విజయం సాధించి ఐపీఎల్ కప్ ను గెలుచుకుంది… దాంతో ముంబై ఖాతాలో నాలుగు టైటిల్ కప్స్ చేరాయి…

అయితే ఈ సారి ఎట్టిపరిస్థితిల్లోనూ సీఎస్ కే టైటిల్ కైవసం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయ పడ్డారు.. ఐపీఎల్ కవరేజ్ లో భాగంగా బ్రాడ్ కాస్ట్ హోస్ట్ గా చేయనున్న బ్రిట్ లీ ప్రస్తుతం ముంబైకి చేరుకుని అక్కడ ఐసోలేషన్ లో ఉన్నాడు…

ఈ క్రమంలో ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు వేశారు…. ఈ సారి ఐపీఎల్ కప్ ఎవరిదని భావిస్తున్నారని అభిమానులు ప్రశ్నలు వేశారు ఇందుకు లీ సమాధానం ఇస్తూ విజేత ఎవరనేది చెప్పడం కష్టమే అయినా సీఎస్ కే కప్ గెలుస్తుందని అనుకుంటున్నట్లు చెప్పాడు…