ఐపీఎల్ 2022: అహ్మ‌దాబాద్ టైటాన్స్ గా బరిలోకి..

IPL 2022: Ahmedabad enters the ring as Titans

0
99

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నారు. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.

రాబోయే ఐపీఎల్ కోసం అన్ని ఫ్రొంచైజీలు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ల‌క్నో ఫ్రొంచైజీ పేరు కూడా ప్రకటించగా..తాజాగా అహ్మ‌దాబాద్ ఫ్రొంచైజీ కూడా పేరును అధికారికంగా ప్ర‌క‌టించింది. మెగా వేలానికి ఐదు రోజుల ముందు తమ ఫ్రొంచైజీ పేరును అహ్మ‌దాబాద్ ప్ర‌క‌టించింది. అహ్మ‌దాబాద్ టైటాన్స్ గా అహ్మ‌దాబాద్ యాజ‌మాన్యం అయిన సీవీసీ సంస్థ పేరును ప్ర‌క‌టించింది. అయితే మెగా వేలానికి కేవ‌లం ఐదు రోజుల ముందే హ‌డావుడిగా సీవీసీ సంస్థ త‌మ ఫ్రొంచైజీ పేరును ప్ర‌క‌టించింది.

కాగ అహ్మ‌దాబాద్ టైటాన్స్ జ‌ట్టు ఇప్ప‌టికే ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను రిటెన్షన్ ప్ర‌క్రియాలో భాగంగా ఎంచుకుంది. రూ. 15 కోట్లు వెచ్చించి.. హార్ధిక్ పాండ్యను తీసుకుంది. అలాగే కెప్టెన్ గా కూడా నియ‌మించింది. అలాగే ఆఫ్థాన్ స్టార్ స్పిన్న‌ర్ రషీద్ ఖాన్ ను కూడా రూ. 15 కోట్లు వెచ్చించింది. అలాగే యువ సంచ‌ల‌నం శుభ్ మాన్ గిల్ కోసం రూ. 8 కోట్లు ఖ‌ర్చు చేసింది.