నేడే ఐపీఎల్‌ 2022 వేలం..బరిలో 512 ఆటగాళ్లు

IPL 2022 auction today..512 players in the ring

0
113

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌ 2022 వేలం రానే వచ్చింది. బెంగళూరులో శనివారం, ఆదివారం ఈ వేలం జరగనుంది. పాత 8 జట్లతో పాటు ఈ సీజన్‌లో కొత్తగా గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ సూపర్ జెయింట్స్ కూడా ఈ సారి వేలంలో పాల్గొననున్నాయి. ఇక ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 590 మంది ఆటగాళ్లు పాల్గొంటారు.

228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నారు. ఐపీఎల్ వేలంలో వాడే రైట్ టు మ్యాచ్ కార్డు మాత్రం ఈ సారి అందుబాటులో ఉండడం లేదు. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా వేలంపాటలో వేరే జట్టు దక్కించుకున్న ప్లేయర్‌ని… అదే రేటుకి పాత ఫ్రాంఛైజీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశం ఉండదు. ఐపీఎల్ 2022 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో 90 కోట్ల రూపాయలు. ఇంతకుముందు ఈ వాల్యూ 85 కోట్లు ఉండగా… మరో రూ.5 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

ఆర్‌పీ సంజీవ్ గోయింకా గ్రూప్… లక్నో జట్టును 7090 కోట్లకు కొనుగోలు చేయగా… అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ 5625 కోట్లకు కొనుగోలు చేశారు. కాగ అహ్మ‌దాబాద్ టైటాన్స్ జ‌ట్టు ఇప్ప‌టికే ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను రిటెన్షన్ ప్ర‌క్రియాలో భాగంగా ఎంచుకుంది. రూ. 15 కోట్లు వెచ్చించి.. హార్ధిక్ పాండ్యను తీసుకుంది. అలాగే కెప్టెన్ గా కూడా నియ‌మించింది. అలాగే ఆఫ్థాన్ స్టార్ స్పిన్న‌ర్ రషీద్ ఖాన్ ను కూడా రూ.15 కోట్లు వెచ్చించింది. అలాగే యువ సంచ‌ల‌నం శుభ్ మన్ గిల్ కోసం రూ. 8 కోట్లు ఖ‌ర్చు చేసింది.