ఐపీఎల్ 2022: బీసీసీఐ కీలక మార్పులు..రెండు గ్రూప్‌లుగా జట్లు

0
65

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్ 2022 మార్చి 26 నుండి ప్రారంభం కానుంది. మే 29వ తేదీన అహ్మదాబాదులో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో  ముగియనుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌ జట్లను ఎప్పుడు లేని విధంగా రెండు గ్రూపులుగా బీసీసీఐ విభజించింది. దీంతో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. రెండు కొత్త జట్లు, లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ వేర్వేరు గ్రూపులలో చోటు దక్కించుకున్నాయి. ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గ్రూప్ A:

ముంబై ఇండియన్స్ (MI)

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

రాజస్థాన్ రాయల్స్ (RR)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

గ్రూప్ B:

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

పంజాబ్ కింగ్స్ (PBKS)

గుజరాత్ టైటాన్స్ (GT)