IPL 2022: గుజరాత్ టైటాన్స్ లోగో చూశారా? కొత్త ట్రెండ్​ ఇదే!

0
91

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతున్నాయి.

తాజాగా గుజరాత్​ టైటాన్స్​(జీటీ) తమ జట్టు లోగోను ఆదివారం ఆవిష్కరించింది. ఐపీఎల్​లో ఇప్పటివరకు ఏ జట్టు చేయని విధంగా మెటావర్స్​లో జట్టు లోగో ఆవిష్కరించి కొత్త ట్రెండ్​ సెట్​ చేసింది.  ‘ది టైటాన్స్​ డగౌట్​’ పేరుతో ఉన్న ఈ వర్చువల్​ స్పేస్​లోనే లోగోను ఆవిష్కరించింది. అందులో జట్టు కోచ్​ ఆశిష్​ నెహ్రా, కెప్టెన్​ హార్దిక్​ పాండ్య, శుభ్​మన్​ గిల్​లు కనిపించారు.

సీవీసీ గ్రూప్​.. అహ్మదాబాద్​ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్​ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టారు. గుజరాత్ టైటాన్స్.. ప్రీ ఆక్షన్​లో హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్​మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. వీరితో పాటు జేసన్​ రాయ్, మాథ్యూ వేడ్​, డేవిడ్​ మిల్లర్​, మహ్మద్​ షమి, ల్యూకీ ఫెర్గూసన్​ వంటి నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసింది.