ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీలలో మెగా వేలం జరగనుంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ లు వచ్చిన విషయం తెలిసిందే. లక్నో టీమ్‌కు ‘లక్నో సూపర్‌జెయింట్స్’ అని పేరు పెట్టగా..తాజాగా అహ్మదాబాద్ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టారు.
తాజాగా అభిమానులను నిరాశపరిచే ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు చాలా మంది విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కగిసొ రబాడా(వెస్టిండీస్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా), మార్కొ జాన్సన్(దక్షిణాఫ్రికా) ఉన్నారని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ కోసం వీరు దూరం కానున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ ప్రారంభంలో స్వదేశంలో ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌తో, దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ కారణంగా ఆ దేశ ఆటగాళ్లు తమ జట్టుకు అండగా ఉండేందుకు మెగాటోర్నీకి దూరంగా ఉండనున్నారని తెలిసింది.