ఐపీఎల్ 2022 ప్రారంభం డేట్ ఫిక్స్‌..ఫైన‌ల్స్ ఎక్క‌డంటే?

IPL 2022 start date fix..where are the finals?

0
123

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ వార్త అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది.

గత రెండు సీజన్లను కరోనా బాగా దెబ్బతీసింది. స్వదేశంలో ఐపీఎల్ మజాను ఫ్యాన్స్ కు దూరం చేసింది. గత రెండు సీజన్ల యూఏఈలోనే జరిగాయి. దీంతో ఇండియాలో ఐపీఎల్ జరిగితే చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో అభిమానులను కూడా స్టేడియంలోకి అనుమతించే అవకాశం ఉంది.

అయితే తాజాగా మార్చి 27 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకున్నా..మార్చి 27 నుంచే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 28న ఫైనల్స్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.