Breaking: ఐపీఎల్ 2022 ప్రారంభం తేదీ ఫిక్స్..త్వరలోనే పూర్తి షెడ్యూల్

0
100

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతున్నాయి.

తాజాగా ఐపీఎల్ 2022 మార్చి 26 నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రిలీజ్ కానుంది. అయితే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సీవీసీ గ్రూప్​.. అహ్మదాబాద్​ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్​ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టారు. గుజరాత్ టైటాన్స్.. ప్రీ ఆక్షన్​లో హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్​మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది.