ఐపీఎల్-2022: రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..!

IPL-2022: These are the retained players ..!

0
101

పాత ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసింది. నవంబర్ 30వ తేదీలోపు (ఇవాళ) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి..బెంగళూరు, హైదరాబాద్‌, రాజస్థాన్‌ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా..పంజాబ్‌ కింగ్స్‌ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. వివరాలు కింది విధంగా ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్ – 14 కోట్లు

బట్లర్ – 10 కోట్లు

యశస్వి జైస్వాల్- 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో రాజస్థాన్ వద్ద ఇంకా రూ.62 కోట్లు మిగిలి ఉన్నాయి.

కోల్​కతా నైట్​రైడర్స్

రసెల్ – 12 కోట్లు

వరుణ్ చక్రవర్తి – 8 కోట్లు

వెంకటేశ్ అయ్యర్ – 8 కోట్లు

సునీల్ నరైన్ – 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​ పోగా ఇంకా కోల్​కతా వద్ద రూ.48 కోట్లు మిగిలాయి.

దిల్లీ క్యాపిటల్స్

పంత్ – 16 కోట్లు

అక్షర్ పటేల్ -9 కోట్లు

పృథ్వీ షా – 7.5 కోట్లు

నోర్జ్టే – 6.5 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో దిల్లీ వద్ద ఇంకారూ.47.5 కోట్ల నగదు మిగిలి ఉంది.

న్నై సూపర్ కింగ్స్

రవీంద్ర జడేజా – 16 కోట్లు

ధోనీ – 12 కోట్లు

మొయిన్ అలీ – 8 కోట్లు

రుతురాజ్ – 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో చెన్నై వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది.

సన్​రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్ – 14 కోట్లు

అబ్దుల్ సమద్ – 4 కోట్లు

ఉమ్రన్ మాలిక్ – 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో ఇంకా సన్​రైజర్స్ వద్ద రూ.68 కోట్లు మిగిలాయి.

వార్నర్, బెయిర్​స్టో, భువనేశ్వర్ కుమార్ ఐదు సీజన్ల నుంచి సన్​రైజర్స్​కు ఆడుతున్నారు. కానీ వీరిని ఈ సీజన్​లో అట్టిపెట్టుకోలేదు ఫ్రాంచైజీ. వీరితో పాటు నటరాజన్, హోల్డర్, మనీష్ పాండేలకు మొండిచేయి చూపింది.

పంజాబ్ కింగ్స్

మయాంక్ అగర్వాల్ – 14 కోట్లు

అర్షదీప్ సింగ్ – 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో పంజాబ్ వద్ద ఇంకా రూ.72 కోట్లు మిగిలాయి.

కెప్టెన్ కేఎల్ రాహుల్​కు మొండిచేయి చూపించింది పంజాబ్. దీంతో అతడు కొత్త ఫ్రాంచైజీ లేదా ఆర్సీబీకి ఆడే అవకాశం ఉంది.