ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ లు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గితే టోర్నీని భారత్లోనే నిర్వహించనున్నారు. లేకపోతే విదేశాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ తన జట్టులో ఉండే ముగ్గురు ప్లేయర్ల వివరాలను బీసీసీఐకి పంపించినట్టు తెలుస్తుంది. ముంబై మాజీ ఆటగాడు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ ఆటగాడు, ఆఫ్ఘాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ తో పాటు కోల్ కత్త నైట్ రైడర్స్ జట్టు మాజీ ప్లేయర్, టీమిండియా ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ లను అహ్మదాబాద్ జట్టు తీసుకుంది.
అయితే ముందుగా అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ శ్రేయస్ అయ్యార్ ను, ఇషాన్ కిషన్ తీసుకోవాలని భావించింది. అయితే చివరిగా రషీద్ ఖాన్, గిల్ వైపు మొగ్గు చూపింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య , స్పిన్నర్ రషీద్ ఖాన్ కు రూ. 15 కోట్ల చొప్పున చెల్లించినట్టు సమాచారం. అలాగే శుబ్‌మాన్ గిల్ కు రూ. 7 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. కాగ అహ్మదాబాద్ జట్టు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్య ఉండే ఛాన్స్ ఉంది.