ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 10 జట్లు పాల్గొనబోతుండటమే ఇందుకు కారణం. అలాగే వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగావేలం కూడా జరగనుంది. అందుకోసం జట్లు నేడు (మంగళవారం) అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది.
ఈ కార్యక్రమం రాత్రి 9.30కు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రిటెన్షన్ రూల్స్‌తో పాటు ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకునే అవకాశం ఉందో చూద్దాం.
గరిష్ఠంగా ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ముగ్గురు భారత ఆటగాళ్లు లేదా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను గరిష్ఠంగా తీసుకోవచ్చు. ఆ ముగ్గురు ఆటగాళ్లు క్యాప్డ్ అయినా కావచ్చు, అన్క్యాప్డ్ అయినా కావచ్చు.
ఆయా జట్లు అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా ఇలా ఉండవచ్చు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: రషీద్ ఖాన్, విలియమ్సన్, ఉమ్రన్ మాలిక్
దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్ట్జే
చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ/సామ్ కరన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, చాహల్, హర్షల్ పటేల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: రసెల్, నరేన్, గిల్, వెంకటేశ్ అయ్యర్
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, బుమ్రా, ఇషాన్ కిషన్, పొలార్డ్
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, బట్లర్, బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్
పంజాబ్ కింగ్స్: ఏ ఆటగాడిని తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు