అదేమిటో ఈసారి లీగ్ ఆఖరి దశలో చెన్నై మెరుస్తుంది అంటున్నారు సీఎస్కే అభిమానులు, దానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన రెండు మ్యాచ్చుల్లో చెన్నై జట్టు విజయం సాధించడమే, కేకేఆర్తో తలపడిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 6 వికెట్ల తేడాతో కోల్కతాను ఓడించింది.
గైక్వాడ్ 72 కొట్టాడు, భారీ షాట్లతో విరుచుపడి హఫ్ సెంచరీతో రాణించాడు. రాయుడు కూడా మంచి షాట్లతో దాటిగానే ఆడాడు 38 కి అవుట్ అయ్యాడు.చివరిలో జడేజా సూపర్ హిట్టింగ్ ఆడాడు. 11 బంతుల్లో 31 పరుగులు చేసి చెన్నైని గెలిపించాడు. దీంతో ఆటగాళ్లు గెలుపుని ఎంజాయ్ చేశారు.
ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
కేకేఆర్ కి నితీష్ రాణా 61 బంతుల్లో 87 పరుగులతో చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.కేకేఆర్ జట్టుకి ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లారు చెన్నై ఆటగాళ్లు.