ఐపీఎల్ అభిమానులకి మరో గుడ్ న్యూస్ నెక్ట్స్ ఇయర్ ఐపీఎల్ ఎప్పుడంటే

ఐపీఎల్ అభిమానులకి మరో గుడ్ న్యూస్ నెక్ట్స్ ఇయర్ ఐపీఎల్ ఎప్పుడంటే

0
122

ఏప్రిల్ – మే మధ్య జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ఈ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి, చివరకు ఏకంగా ఏప్రిల్ నుంచి నాలుగు నెలలు వెనక్కి వెళ్లిపోయాయి, ఇప్పుడు ఫైనల్ పోరు జరుగబోతోంది, మరి ఇంకా కరోనా తీవ్రత తగ్గలేదు, టీకా వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది.

ఈ సమయంలో మరి వచ్చే ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ పాతలా జరుగుతుందా లేదా మారుతుందా అంటే… తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం 2021లో ఐపీఎల్ పోటీలు ఏప్రిల్ లోనే ప్రారంభం అవుతాయని, ఇండియాలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.

ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తరలిపోయి ఇక్కడ జరిగాయి, నెక్ట్స్ టైమ్ మన దేశీయ గడ్డపైనే ఈ కప్ మ్యాచులు జరుగుతాయి..ఆటగాళ్ల కోసం బయో బబుల్ ఏర్పాటు చేస్తామని, అప్పటి పరిస్థితిని బట్టి, ప్రేక్షకులను కూడా పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని గంగూలీ వెల్లడించారు. సో అభిమానులకి ఇది మంచి కిక్ ఇచ్చే వార్త అని చెప్పాలి.