IPL: గుజరాత్ గర్జించేనా..టైటాన్స్ బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

0
97

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి. అహ్మదాబాద్ జట్టుని రూ.5625 కోట్లకి సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని రూ.7090 కోట్లకి ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చేజిక్కించుకుంది. దాంతో.. ఇకపై 10 జట్లతో ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో తొలిసారి ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది? మరి ఆ జట్టు బలాలు, బలహీనతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.15 కోట్లు వెచ్చించి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను దక్కించుకున్న టైటాన్స్‌.. అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (రూ.15 కోట్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (రూ.8 కోట్లు) లాంటి ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేసింది. మెగా వేలంలో మరో 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. పేసర్లు ఫెర్గూసన్‌ (రూ.10 కోట్లు), మహ్మద్‌ షమి (రూ.6.25 కోట్లు), ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాతియా (రూ.9 కోట్లు)లను భారీ ధరకు కొనుక్కుంది.

బలాలు:

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగలరు. ముఖ్యంగా రషీద్‌ఖాన్‌ ఎంపిక ఆ జట్టు బలాన్ని ఎంతో పెంచింది. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే ఈ అఫ్గాన్‌ బౌలర్‌ కచ్చితంగా గుజరాత్‌కు కొండంత అండ.

మిల్లర్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌ లాంటి హిట్టర్లు ఉండడం

రషీద్‌, జోసెఫ్‌, షమి పేస్ త్రయం.

బలహీనతలు:

గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా కెప్టెన్‌ పాండ్య బలహీనత కూడా

జేసన్‌ రాయ్‌ లీగ్‌ నుంచి తప్పుకోవడం

విజయ్‌ శంకర్‌, మిల్లర్ ఏ మేర రాణిస్తారో చూడాలి.

శుభ్‌మన్‌కు తోడు సరైన ఓపెనర్‌ లేకపోవడం కూడా గుజరాత్‌కు ప్రతికూలాంశమే.