ముగిసిన ఐపీఎల్​ మెగా వేలం..వారికి కళ్లు చెదిరే ధర!

0
121

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళఅలు ఉన్నారు. వీరి కోసం అన్నీ ఫ్రాంఛైజీలు కలిపి 5,51,70,00,000కోట్లు ఖర్చు చేశాయి. మొత్తంగా ఈ మెగావేలంలో ఇషాన్​ కిషన్​(రూ.15.25కోట్లు, ముంబయి ఇండియన్స్​) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు.

ఆ తరువాత దీపక్ చాహర్​ రూ.14 కోట్ల(సీఎస్కే), శ్రేయస్​ అయ్యర్​ రూ.12.25కోట్లు (కేకేఆర్​) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ రెండు రోజు జరిగిన వేలంలో వీరిని ఎవరు అధిగమించలేకపోయారు. అయితే ఈ రెండో రోజు జరిగిన ఆక్షన్​లో అత్యధికంగా లివింగ్‌ స్టోన్​ను రూ. 11.50 కోట్లకు పంజాబ్​ సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌ ఆటగాడు ఓడియన్ స్మిత్‌ను కూడా రూ. 6 కోట్లు వెచ్చించి పంజాబ్‌ కింగ్స్‌ జట్టే దక్కించుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ల జోఫ్రా ఆర్చర్ ను.. 8 కోట్లకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు.. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ను ఏకంగా 8కోట్ల 25లక్షలకు దక్కించుకుంది.

ఆఖరికి డేవిడ్‌ను ముంబయి రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ విదేశీ ప్లేయర్లలో డేవిడ్‌నే భారీ ధర వరించింది. ఇక వెస్టిండీస్‌ ఆటగాడు రొమారియో షెప్పార్డ్‌ను సన్‌రైజర్స్ జట్టు.. 7.75కోట్లకు తీసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్ క్రమ్ ను 2.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీసుకుంది. భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు కోటీ 70 లక్షలకు దక్కించుకుంది. విజయ్ శంకర్​ను కోటీ 40లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొనగా, మన్ దీప్ సింగ్ ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు.. కోటీ 10 లక్షలకు దక్కించుకుంది. అజింక్య రహానెను కోల్ కతా నైట్ రైడర్స్ కోటి రూపాయల బేస్ ధరకే కొనుగోలు చేసింది. డేవిడ్ మలాన్, మార్నస్ లబుషేన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, జేమ్స్ నీషమ్, ఛతేశ్వర్ పుజారా, సౌరబ్ తివారీని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు