ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు ఆ నెలలో ? అక్కడ జరుగుతాయా?

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు ఆ నెలలో ? అక్కడ జరుగుతాయా?

0
85

ఐపీఎల్ మ్యాచ్ లకి ఈ కరోనా బ్రేకులు వేసింది, బయో బబుల్ అమలు చేసినప్పటికీ ఆటగాళ్లకు ఆ టీమ్ సభ్యులకి కరోనా సోకింది.. దీంతో ఇక మ్యాచ్ లు ఆపేశారు… కొద్ది రోజుల క్రితం ఐపీఎల్ తాజా సీజన్ ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ… అయితే మిగిలిన మ్యాచ్ లు ఎప్పుడు జరుగుతాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు, దీనిపై ప్రకటన వస్తుందా అని చూస్తున్నారు.

మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబరులో నిర్వహించాలని ఆలోచిస్తోందట. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరులో ఐపీఎల్ రెండో దశ నిర్వహణకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్చిస్తున్నాయి. ఇక ఇక్కడ కేసులు తగ్గకపోతే ఇక ఇంగ్లండ్ లేదా మరో దేశంలో మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

గతేడాది ఐపీఎల్ ను కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించగా, బయో బబుల్ అత్యంత సమర్థవంతంగా అమలు చేసి టోర్నీని పూర్తి చేశారు. అయితే అక్కడ కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు…సో చూడాలి కేసులు మరో నెలలో తగ్గితే ఇక్కడే జరగవచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకూ అభిమానులు వెయిట్ చేయాల్సిందే.