IPL: కప్పు కొట్టాలని ఆర్సీబీ ఆరాటం..బలాలు , బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

0
113

ఐపీఎల్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉంది అంటే అది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అనే చెప్పుకోవాలి. కప్పుకు ఒక్క అడుగు దూరంలో ఓ సారి పాయింట్ల పట్టికలో చివరిసారి ఇలా ఆర్సీబీ ఆట ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఉన్న మంచి ప్లేయర్లు పోయారు. మరి ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 కప్పు బెంగళూరు కొట్టాలని చూస్తుంది.

విరాట్ కోహ్లి చాలా కాలం కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టైటిల్ గెలవలేకపోయారు ఆర్సీబి. అయితే కొత్త సారథి, కొత్త ఆలోచనతో రంగంలోకి దిగబోతోంది. ప్రస్తుతం AB డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే మరో బిగ్ మ్యాచ్ విన్నర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇతడు కూడా ఇప్పుడు జట్టులో లేడు. దేవదత్ పడిక్కల్ వంటి యువ ఓపెనర్‌ను జట్టు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో జట్టు ఆట ఎలా వుండబోతుందో చూడాలి మరి.

బలాలు:

ఆర్సీబీ బ్యాటింగ్ భారం మొత్తం విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌పైనే ఉంది. దినేష్ కార్తీక్, డుప్లెసిస్ ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ తో బౌలింగ్ భీకరంగా ఉంది.

బలహీనతలు: 

ఈసారి వేలానికి ముందు దాదాపు అన్ని జట్లూ పలువురు కీలక ఆటగాళ్లను తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేసుకున్నా.. వేలంలో తిరిగి కొనుగోలు చేశాయి. కానీ, ఆర్సీబీ ఈసారి ఆ విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎందుకంటే యువ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఎంతో అనుభవమున్న స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ లాంటి కీలక ఆటగాళ్లను కూడా తిరిగి సొంతం చేసుకోలేకపోయింది.. సుయాష్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమోర్డ్, అనూజ్ రావత్‌ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.