IPL: రెండో టైటిల్ వేటలో రాయల్స్..జట్టు బలం, బలహీనత ఎలా ఉన్నాయంటే?

0
97

ఐపీఎల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు అన్ని జట్ల బలం, బలహీనత తెలుసుకున్నాం. ఇక చివరగా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఐపీఎల్ లో ఏ మేర రాణిస్తుంది. ఫస్ట్ ఐపీఎల్, ఫస్ట్ కప్ ఎగరేసుకుపోయిన ఈ జట్టు ఇంతవరకు మరోసారి విజేతగా నిలవలేకపోయింది RR. మరి ఈసారి కొత్త రూపు సంతరించుకున్న రాజస్థాన్‌.. సమష్టిగా సత్తాచాటి రెండో సారి టైటిల్‌ను దక్కించుకుంటుందా ? ప్రధాన ఆటగాళ్లు ఆకట్టుకుంటారా ఇప్పుడు చూద్దాం..

2008లో తొలిసారి విజేతగా నిలిచిన ఆ జట్టుకు మళ్లీ ఆ ముచ్చట తీరలేదు. ఈసారి ఎలాగైనా టైటిల్‌ పట్టేయాలనే పట్టుదలతో లీగ్‌లో అడుగుపెడుతోంది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (రూ.14 కోట్లు), బట్లర్‌ (రూ.10 కోట్లు), యశస్వి జైశ్వాల్‌ (రూ.4 కోట్లు)ను అట్టిపెట్టుకున్న జట్టు.. మెగా వేలంలో మరో 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

బలం:

కెప్టెన్‌ సంజు శాంసన్‌, బట్లర్‌ , యశస్వి జైశ్వాల్‌.

పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ

విండీస్‌ విధ్వంసక బ్యాటర్‌ హెట్‌మయర్‌, బౌల్ట్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌

యుజ్వేంద్ర చాహల్‌, అశ్విన్‌ స్పిన్ ద్వయం

బలహీనత:

నిఖార్సైన ఆల్‌రౌండర్లు లేకపోవడం

శాంసన్‌ నిలకడ లేమి

విదేశీ పేసర్లలో బౌల్ట్‌ కు ప్రత్యామ్నాయం లేకపోవడం.

జట్టు కూర్పు