IPL: టైటిల్ పోరుకు సిద్దమవుతున్న SRH..కేన్ సేన బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

0
116

మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 2016 తర్వాత సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. వార్నర్​ సారథ్యంలో ఆ కప్పు కైవసం చేసుకుంది ఎస్​ఆర్​హెచ్​. ఈ నేపథ్యంలోనే మెగా వేలంలో ఎస్​ఆర్​హెచ్​ ఫ్రాంఛైజీ ఆటగాళ్ల కొనుగోలు విషయంలో కాస్త తడబడిన చివరకు మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మరి ఈసారి హైదరాబాద్ జట్టు కప్పు కొట్టాలనే తహతహతో ఉన్నారు. మరి ఆ జట్టు బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సన్‌రైజర్స్‌ జట్టు ఈ ఐపీఎల్‌ మెగా టోర్నీకి ముగ్గురు క్రికెటర్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు ఒకరు కాగా, మిగతా ఇద్దరు భారత యువ పేసర్లు ఉన్నారు. కెప్టెన్‌కు రూ.14 కోట్లు కేటాయించిన సన్‌రైజర్స్‌.. మిగిలిన ఇద్దరు బౌలర్లు అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు చెరో రూ4. కోట్లు వెచ్చించింది. వార్నర్‌ సారథ్యంలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ గతంలో బాగా రాణించిందంటే కారణం ఆ జట్టుకున్న ఓపెనర్లే ప్రధాన కారణం. అందులో ఒకరు వార్నర్‌ ఉండగా మరొకరు ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో ఉండేవాడు. కానీ ఈసారి ఆ జట్టు వారిద్దరినీ వదిలేసింది.

బలాలు:

ఈసారి అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు ఓపెనింగ్ చేయవచ్చు.  మొన్న జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, ఐడన్ మార్క్రామ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను కొనుగోలు చేయడంతో అంచనాలు పెరుగుతున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో హైదరాబాద్ జట్టుకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, మార్కో యాన్సన్, రొమారియో షెపర్డ్ లాంటి వారు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

బలహీనతలు:

రషీద్ ఖాన్‌ను కోల్పోవవడం మాత్రం ఆ జట్టుకు నష్టమే. అలాగే వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే విదేశీ ఆటగాడు లేకపోవడం దెబ్బె. ఫాస్ట్ బౌలింగ్ లో పరవాలేదనిపిస్తున్న అనుభవం గల స్పిన్నర్ లేకపోవడం లోటు. అలాగే బ్యాటింగ్ లో భారత ఆటగాళ్ల ఆట ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.