ఐపీఎల్లో సన్రైజర్స్ కు మరో భారీ దెబ్బ

ఐపీఎల్లో సన్రైజర్స్ కు మరో భారీ దెబ్బ

0
88

టీమ్ లో ముందు అనుకున్న సభ్యులు, టీమ్ నుంచి ఎవరైనా బయటకు వెళితే అది కచ్చితంగా టీమ్ పై ప్రభావం చూపిస్తుంది, తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో ఓ టీమ్ కు ఇదే ఎదురుదెబ్బ తగలింది అంటున్నారు క్రీడా అనలిస్టులు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్లో బౌలింగ్ వేస్తూ గాయపడిన ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఆ గాయం తీవ్రత తగ్గకపోవడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

మార్ష్ స్థానాన్ని వెస్టిండీస్ కెప్టెన్ జానస్ హోల్డర్తో భర్తీ చేయనున్నారు. హోల్డర్ త్వరలోనే జట్టులో చేరనున్నాడు. గాయం తగ్గితే వద్దాము అనుకున్నా అది మరింత వేధించడంతో మార్ష్ తప్పుకున్నాడు. అయితే అతను త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాం…మార్ష్ స్థానాన్ని జాసన్ హోల్డర్ భర్తీ చేయనున్నాడు అని సన్రైజర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది మార్ష్ కుడికాలి చీలమండకు గాయమైంది అతను చికిత్స తీసుకుంటున్నాడు.