ఐపీఎల్లో ఈ సీజన్లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి, అంతేకాదు వీర బాదుడు బాదుతున్నారు బ్యాట్స్ మెన్స్, ఆ లెవల్లో బౌలింగ్ కూడా ఉంటోంది, సరికొత్త రికార్డులు అభిమానులకి జోష్ ఇస్తున్నాయి, తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘతన సాధించాడు.
కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పది పరుగులు చేసి.. ఐపీఎల్ లో 5 వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఐపీఎల్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి విదేశీ క్రికెటర్ వార్నర్ అయ్యాడు, ఇది అతనిపై రికార్డు, ఇక ఈ బ్రేక్ రికార్డ్ సాధించిన వారిలో చూస్తే..
రైనా, కోహ్లి, రోహిత్ లు ఉండగా.. ఇప్పుడూ సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. వార్నర్ ఈ ఘనతను 135 ఇన్నింగ్స్ల్లో సాధించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వేగంగా 5 వేల రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డును వార్నర్ తిరగరాశాడు.ముందు రైనా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ చేశారు.