ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు ఉన్నాయి, ఈ ఏడాది కూడా టీమ్స్ అనేక రికార్డులు క్రియేట్ చేశాయి, అంతేకాదు ఐపీఎల్ టోర్నీలో పరుగుల వరద కొనసాగిస్తున్నారు బ్యాట్స్ మెన్స్, ఇక ఈ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు.
ఈ రికార్డు ఎవరూ క్రియేట్ చేయలేదు అనే చెప్పాలి, ఈ రికార్డు క్రియేట్ చేసిన ఒకే ఒక్కడు వార్నర్ మాత్రమే… వరుసగా ఆరు ఐపీఎల్ సీజన్లలో 500 స్కోర్లు సాధించిన మొదటి ప్లేయర్‌గా వార్నర్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్‌లో అత్యధికసార్లు 500 పరుగులు సాధించిన ఆటగాడిగా వార్నర్ నిలిచారు, ఇక జట్టు విజయానికి ఎన్నో సార్లు ప్రత్యక్షంగా తన బ్యాటింగ్ తో మెరుపులు మెరిశాడు.
2020 ఐపీఎల్ 529 పరుగులు
2019 ఐపీఎల్‌లో 692 పరుగులు
2018 ఐపీఎల్ ఆడలేదు
2017 సీజన్‌లో 641 పరుగులు
2016 సీజన్‌లో 848 పరుగులు
2015 సీజన్‌లో 562 పరుగులు
2014 సీజన్‌లో 528 పరుగులు