మహిళా ప్రయాణికులకు IRCTC రక్షా బంధన్ ఆఫర్

IRCTC Raksha Bandhan offer for female passengers

0
81

IRCTC రక్షా బంధన్ సందర్భంగా ఓ సరికొత్త ఆఫర్ ఇచ్చింది.మహిళా ప్రయాణికులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. ఇంతకీ ఈ ఆఫర్ ఏమిటి అనేది చూద్దాం. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే మహిళ ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ వారికి క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి వస్తుంది.

ఆగస్టు 15 నుండి ఆగష్టు 24 వరకు రెండు తేజస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులందరికీ రక్షా బంధన్ సందర్భంగా 5 శాతం ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టుగా ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. కేవలం ఎప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ కాలం ఇచ్చారో అప్పటి వరకూ మాత్రమే ఇది వర్తిస్తుంది. మహిళలు ఈ సమయంలో ఎన్ని సార్లు అయినా ప్రయాణం చేయవచ్చు.

మీకు ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ టిక్కెట్లు బుక్ చేయబడిన ఖాతాలోకి జమ అవుతుంది. తేజస్ ఎక్స్ ప్రెస్ లో లక్నో-ఢిల్లీ-లక్నో రైలు నెం. 82501/02, అహ్మదాబాద్-ముంబై-అహ్మదాబాద్ రైలు నంబర్ 82901/02 మార్గాల్లో నడుస్తున్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ రెండు తేజస్ రైళ్లను నడుపుతోంది.