పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు లో జాక్వలిన్ పాత్ర అదేనా ?

Is Jacqueline's character in Pawan Kalyan Hariharaveeramallu ?

0
105

సాహోలో ప్రభాస్ తో పోటీ పడి నాజూకు డ్యాన్సులు చేసిన జాక్వలిన్ ని ఎవ్వరూ మర్చిపోలేరు. బాలీవుడ్ లో తన నటన అందచందాలతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది. అయితే తాజాగా మరో వార్త టాలీవుడ్ లో కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ సినిమాలో ఆమె నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. మొగలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక భారీ బడ్జెట్ తో ఈ చిత్రం చేస్తున్నారు. అయితే ఇందులో పవన్ బంధిపోటుగా కనిపించనున్నారు.

జాక్వలిన్ యువరాణి పాత్రలో నటిస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాలో ఆమె నటిస్తోంది అనే వార్తలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో జాక్వలిన్ ఒకరు. శ్రీలంకలో పుట్టి పెరిగిన జాక్వలిన్ హిందీలో దూసుకుపోతున్నారు. సౌత్ లో కూడా ఆమెకి పలు అవకాశాలు వస్తున్నాయి.