టీమిండియా పేస్ సంచలనం జాస్ప్రిత్ బుమ్రా అతని ఆట గురించి అందరికి తెలిసిందే. ఇక రెండు మూడు రోజులుగా అతని పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి..ముఖ్యంగా హీరోయిన్ అనుపమని అతను వివాహం చేసుకుంటున్నాడు అని వార్తలు వినిపించాయి, అయితే తాజాగా దీనిపై అనుపమ తల్లి క్లారిటీ ఇచ్చారు, ఇది అవాస్తవం అని ఆమె సినిమా షూటింగు కోసం అక్కడికి వెళ్లింది అని ఇలాంటి వార్తలు నమ్మవద్దు అని తెలిపారు.
అయితే తాజాగా ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో కాదు స్టార్ స్పోర్స్ యాంకర్ సంజనా గణేషన్ అని వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి, ఇక సంజనని అతను పెళ్లి చేసుకుంటున్నాడు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాని దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే దీనిపై అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు..గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో పెళ్లి జరుగుతుందని సోషల్ మీడియా ద్వారా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై ఎవరో ఒకరు స్పందించాలి అని కోరుతున్నారు ఫ్యాన్స్ .