షేన్​ వార్న్​ చనిపోడానికి కారణం ఇదే?

Is this the reason Shane Warne died?

0
81

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్​ వార్న్​ మృతి..యావత్ క్రికెట్​ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. థాయ్‌లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లాలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలిపిన వార్న్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ తాజాగా మరో విషయాన్ని​ తెలిపారు.

ఒక రోజు ఛాతి వద్ద నొప్పిగా ఉందని, చెమటలు పడుతున్నాయని వార్న్ ​చెప్పారని మేనేజర్​ ఎర్స్​కిన్​ తెలిపారు. సాధారణంగా వార్న్​ ఎక్కువగా సిగరెట్లు​ తాగుతారని ఎర్స్​కిన్​ అన్నారు. అందుకే అది గుండెపోటే అయి ఉంటుందని, ఇంకా వేరేది ఏం కాదన్నారు. బరువు తగ్గేందుకు 14 రోజుల డైట్​ కూడా చేస్తున్నారని తెలిపారు. దీనిపై కొద్ది రోజుల ముందు వార్న్​ ఇన్​స్టాగ్రామ్​లో కూడా పోస్ట్ చేశారు.

కాగా వార్న్ మరణంలో అనుమానాస్పద సూచనలేమీ లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని థాయ్​లాండ్ పోలీసులు తెలిపారు. శవపరీక్షలో కూడా సహజ కారణాల వల్లే వార్న్ మృతిచెందినట్లు స్పష్టమైందని వెల్లడించారు. కాగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పది సార్లు తీశారు.