సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. కేవలం 32 బంతుల్లో 84 పరుగులతో రాణించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కిషన్.. టీ20 ప్రపంచకప్ గురించి కోహ్లీ ఏం చెప్పాడో ఈ సందర్బంగా వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్‌లో తాను ఓపెనర్ కోటాలో ఎంపికైనట్లు కోహ్లీ తెలిపాడని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. పాజిటివ్ దృక్పథంతో బ్యాటింగ్ చేశాం. 250-260 పరుగులు సాధిస్తామని అనుకున్నాం. మాలిక్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్ ఆడా. ఈ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. లీగ్‌లో ప్రతి పరిస్థితికి ముందే సిద్ధమై ఉండాలి. అత్యున్నత ఫామ్‌లో ఆడాలి. ఫామ్ కోల్పోయి బాధపడుతున్న సమయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్ నాకు మద్దతుగా నిలిచారంటూ కిషన్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టును చూసిన మాజీలు..రోహిత్‌తో పాటు రాహుల్ ఓపెనింగ్ చేయాలని సూచించారు. అలాగే కోహ్లీ కూడా హిట్‌మ్యాన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే వీలుందని అప్పట్లో చెప్పాడు. తాజాగా ఇషాన్ కూడా ఈ జాబితాలో చేరాడు. దీంతో ఓపెనర్లుగా ఎవరు వస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.