చరిత్ర సృష్టించిన అయ్యర్..తొలి భారత ఆటగాడిగా..

Iyer made history..first Indian player ..

0
98
Shreyas Iyer

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్​లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్​లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అరంగేట్ర టెస్టులోనే శతకం, అర్ధ శతకం బాదిన తొలి భారత క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు. అలాగే అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్​లో 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్​గా నిలిచాడు శ్రేయస్. ఇంతకుముందు సునీల్ గావస్కర్ (1971లో), దిలావర్ హుస్సేన్ (1934లో) ఈ ఘనత సాధించారు.

ఆ జట్టు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు మరోసారి ఫ్లాప్‌ అయ్యారు. పుజారా (22), కెప్టెన్ అజింక్యా రహానె (4) నిరాశ పరిచారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల నిరంతర పేలవ ప్రదర్శనతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు. నెటిజన్లు వీరిపై చాలా కోపంగా ఉన్నారు.