ప్రభుత్వ పాఠశాలలో చేరండి..రూ.5000 పొందండి

0
107

తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, కోట్లు ఖర్చు పెట్టిన ప్రైవేట్ స్కూళ్లకే పిల్లల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. దీనితో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి రూ.5000 ఇస్తామంటూ సర్పంచ్ ఆకిటి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు ప్రకటించారు. అంతేకాక విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం ,బూట్లు, సాక్సులు, బస్ పాస్ అందిస్తామని పేర్కొన్నారు.

అంతేకాదు ప్రకటించిన నజరానాల వివరాలతో ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిగతా గ్రామాల్లో కూడా ఇలాగె చేస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.