ఆటగాళ్లు దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనం ఏమి చెప్పగలం. ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడటం పట్ల గర్వపడాలి. వారి ఆర్థిక పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి పెద్దగా చెప్పలేను” అని కపిల్ దేవ్ ఓ వార్త సంస్థతో మాట్లాడారు. అయితే ముందుగా దేశంలోని జట్టు ఆ తర్వాత ఫ్రాంచైజీలు ఉండాలని నేను భావిస్తున్నాను. జాతీయ జట్టుకు ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు ఉన్నారని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అక్కడ (ఐపీఎల్) క్రికెట్ ఆడకూడదని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు క్రికెట్‌ను మరింత మెరుగ్గా ప్లాన్ చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని చెప్పాడు. భారత్ ప్రపంచ కప్ నిష్క్రమణ తర్వాత దిగులు చెందాల్సిన అవసరం లేదని, రాబోయే ప్రధాన టోర్నమెంట్‌ల కోసం ఆటగాళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను బీసీసీఐ ప్రారంభించాలని కపిల్ సూచించాడు.
“ఇది భవిష్యత్తును చూడవలసిన సమయం. మీరు వెంటనే ప్లాన్ చేయడం ప్రారంభించండి. వెళ్లి ప్లాన్ చేయండి. ఐపీఎల్ మధ్య కొంత గ్యాప్ ఉందని నేను భావిస్తున్నాను. ఈ రోజు మన ఆటగాళ్లపై భారీ అంచనాలు, కానీ వారు దానిని ఎక్కువగా రాణించలేకపోతున్నారు. సోమవారం నాటి సూపర్ 12 మ్యాచ్ తర్వాత అతని పదవీకాలం ముగియనున్న తరుణంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఐపీఎల్, టీ 20 ప్రపంచ కప్ మధ్య విరామం ఆటగాళ్లకు సహాయపడుతుందని చెప్పాడు.