ఆ వికెట్ కీపర్ చేసిన త్రోతో స్టేడియంల నవ్వులు

ఆ వికెట్ కీపర్ చేసిన త్రోతో స్టేడియంల నవ్వులు

0
94

ఇంగ్లాండ వేదికగా జరుగుతున్న నార్త్ గ్రూప్స్ విటాలిటీ బ్లాస్ట్ టీ 20 లీగ్లో యార్క్‌ైషెర్, డ్యూరమ్ జట్ల మధ్య జరుగుతున్న బ్యాచ్‌లో ఓ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. స్పీన్నర్ కేశవ్ బాలింగ్ చేసిన బాల్ బ్యాట్కు తగలకుండా ప్యాడ్లకి తాకి కింద పడింది.

అయితే రన్‌కోసం క్రీజును వదిలిన బ్యాట్స్ మెన్లు పరుగు తీశారు. ఈ క్రమంలో పిచ్‌పై పడిన బంతిని రాకెట్ వేగంతో అందుకున్న వికెట్ కీపర్ అదే వేగంతో ఎండ్‌లో బాల్ త్రో చేశాడు.అంతే ఆ బంతి పొరపాటున వికెట్లకు తగలకుండా పక్కనే ఉన్న బౌలర్ తొడ వెనకభాగంలో తగిలింది.

దీంతో నొప్పిని తట్టుకోలేక ఆబౌలర్ పక్కకు పరిగెత్తాడు. అనుకోని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్క సారిగా స్టేడియంలో నవ్వులు పూశాయి. ఇంతగా నవ్వు తెప్పించిన ఈ సీన్‌కు “ద పూర్ బౌలర్” అని క్యాప్షన్ ఇచ్చి బ్లాస్ట్ 19 హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.