కివీస్ నడ్డి విరిచిన ఇండియా స్పిన్నర్లు..భారత్ ఆధిక్యం ఎంతంటే?

Kiwis break Indian spinners .. What is the advantage of India?

0
96

భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్​లో భారత్​కు 50 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డివిరిచాడు స్పిన్నర్ అక్షర్ పటేల్.

ఓవర్​నైట్ స్కోర్ 129 వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్​ లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు భారత బౌలర్లపై ఆధిపత్యం వహించి దీటుగా పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్​ (89)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ లాథమ్​ (95)ను బోల్తా కొట్టించాడు అక్షర్ పటేల్.

అనంతరం ఏ ఒక్క కివీస్ బ్యాట్స్​మెన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (18), టేలర్ (11), జేమిసన్ (23), నికోలస్ (2), బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 296 పరుగులకు పరిమితమై 50 పరుగుల ఆధిక్యాన్ని భారత్​కు అప్పగించింది కివీస్.