క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అయితే ఈ టీ 20 మ్యాచ్ లు మరింత ఆకట్టుకుంటున్నాయి అభిమానులని, మరీ ముఖ్యంగా బౌలర్లు తీసే వికెట్లు, బ్యాట్స్ మెన్స్ కొట్టే షాట్లు ఇలా ఒక్కొక్కటి అందరిని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి, అయితే ఈ సమయంలో నకుల్ బాల్ గురించి చర్చ జరుగుతోంది, బాట్స్ మెన్స్ కి ఈ బాల్ తో చుక్కలు చూపిస్తున్నారు.
ఒక్కసారిగా తమ బాల్ వేగాన్ని తగ్గించి బ్యాట్స్ మన్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు అప్పుడప్పుడు ఫాస్ట్ బౌలర్లు వాడుతున్న స్ట్రాటజీ ఇది.. బాల్ ని వేగంగా అప్పటి వరకూ వేసిన బౌలర్ వెంటనే ఆ బాల్ ని వేగంగా విసరకుండా కేవలం నెడతాడు, దీంతో బాల్ స్లోగా వస్తుంది, ఆ స్ట్రాటజీ తెలియక కొందరు బ్యాట్స్ మెన్స్ భారీ షాట్ కొడదాం అనుకుంటారు కాని అది బౌండరీ దాటదు క్యాచ్ అవుతుంది.
లేకపోతే వికెట్ పడుతుంది, ఇలా చాలా మంది ఐపీఎల్లో కూడా తమ స్ట్రాటజీ చూపుతున్నారు…నకుల్ బాల్ ను ముందుగా ఇండియాకు పరిచయం చేసింది ఇండియా పేసర్ జహీర్ ఖాన్….2011 వరల్డ్ కప్ సందర్భంగా ఈ నకుల్ బాల్స్ ను జహీర్ సమర్థవంతగా ఉపయోగించి సక్సెస్ అయ్యాడు…ఇప్పుడు దీనిని చాలా టీమ్స్ వేస్తున్నాయి.