కోహ్లి ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

కోహ్లి ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

0
87

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. కారణం తన చేతిని భార్య అనుష్క శర్మ ముద్దాడింది. దింతో కోహ్లీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విడియో వివరాలను పరిశీలిస్తే, గురువారం ఢిల్లీలో డీడీసీఏ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు.. మరికొందరు క్రికెటర్లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా అంతర్జాతీ క్రికెట్ స్టేడియానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరును పెట్టారు. ఇటీవల అనారోగ్యంతో జైట్లీ మరణించిన సంగతి తెలిసిందే.. అయితే అదే స్టేడియంలోని ఓ స్టాండ్కు విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. ఆ సందర్భంలో కోహ్లీ పక్కన కూర్చున్న భార్య అనుష్క అతని చేతిని ముద్దాడి ఎమోషనల్ అయింది. ఆ సమయంలో విరాట్ కూడా భావోద్వేగానికి గురై భార్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ సన్నివేశం కెమెరాలలో రికార్డ్ కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.