కోహ్లీ ఎంట్రీకి పదేళ్లు…

కోహ్లీ ఎంట్రీకి పదేళ్లు...

0
99

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చి 2020జూన్ 12నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది… జింబాంబ్వేతో 2010 జూన్ 12న జరిగిన టీ20 మ్యాచ్ రంగప్రవేశం చేసిన విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ లోనే 21 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ కలిపి 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు…

ఈ మ్యాచ్ జింబాభ్వే 111 పరుగులుచేయగా 15 ఓవర్లలోనే 112 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది… 2008లోనే వన్డేల్లోకి ప్రవేశించిన కోహ్లీ టీ20లో చోటు సాధించేందుకు రెండేళ్లు సమయం పట్టింది… టీ20లో పదేళ్లు పూర్తి చేసుకున్న విరాట్ నాటి నుంచి నేటివరకు తనదైన ప్రదర్శన కనబర్చుకున్నాడు…