కోహ్లీ రోహిత్ శర్మ పై బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీ రోహిత్ శర్మ పై బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు

0
94

బ్రియాన్ లారా క్రికెట్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఓ గొప్ప ఆటగాడు..వెస్టిండీస్ దీవుల నుంచి వచ్చిన ఈ అద్బుతమైన బాట్సమెన్ తనదైన శైలిలో మ్యాచుల్లో విజ్రుంభించేవాడు….లారా టెస్టుల్లో సాధించిన 400 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

15 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ పై ఓ టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో లారా 400 పరుగులు నమోదు చేశాడు. కాని ఇప్పటికీ ఎవరూ ఆ రికార్డుని మాత్రం సమం చేయలేకపోయారు, అయితే ఆయన రికార్డు గురించి తాజాగా ఆయనే స్పందిచాడు.తన రికార్డును చెరిపివేసే వీలున్న ఆటగాళ్ల గురించి చెప్పమంటే తాను డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లే చెబుతానని అన్నారు లారా.

ఎందుకు అంటే కచ్చితంగా ఇలాంటి అత్యధిక స్కోరింగ్ చేయాలి అంటే మిడిల్ ఆర్డర్ లో వచ్చేవారు కాదు.. ఓపెనర్ తోనే సాధ్యం అవుతుంది.. అందుకే ఓపెనర్ గా వచ్చే వార్నర్ కు ఇది సాధ్యమేనని అన్నాడు… కోహ్లీ క్రీజులో నిలదొక్కుకుంటే అతడ్ని ఆపడం ఎంతో కష్టమని లారా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ గురించి చెబుతూ తనదైన రోజున ఏమైనా చేయగలడని తెలిపాడు. మొత్తానికి లారా మాటతో ఇటు భారత క్రికెట్ అభిమానులు సరైన కామెంట్ లారా చేశారు అని అంటున్నారు.