వెస్టిండీస్ టూర్ లో అన్ని సిరీస్ లను టీమిండియానే గెలవడంతో విరాట్ కోహ్లీ ఆనందంతో పొంగిపోతున్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో ఈ టూర్ లో కోహ్లీకి పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. విండీస్ పర్యటన ముగిసిన నేపథ్యంలో తనకు నచ్చిన లొకేషన్లలో సేద దీరుతున్నాడు కోహ్లీ.
తాజాగా ఒంటిపై చొక్కాలేకుండా ఓ ఫోటోషూట్ లో ఫోజులిచ్చాడు కోహ్లి , అందులోంచి ఓ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు . ‘మనకున్న పరిమితుల్లోనే మనం జీవించగలిగితే, బయటి నుంచి ఏదీ అవసరం లేదు‘ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. అంతే ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.