కృష్ణప్ప గౌతమ్ వరల్డ్ రికార్డ్

కృష్ణప్ప గౌతమ్ వరల్డ్ రికార్డ్

0
98

కర్ణాటక ప్రీమియర్ లీగ్లో భారత క్రికెటర్ కృష్ణ గౌతమ్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్ కు టి 20 ఫార్మాట్ లో మంచి రికార్డ్ ఉంది. అల్ రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ కు ఎన్నో మ్యాచ్ ల్లో విజయాలు అందించి ఆకట్టుకున్నాడు.

తాజాగా కెపిఎల్ లో భాగంగా షిమోగా లయన్స్ తో మ్యాచ్ లో గౌతమ్ (134 నాటౌట్ 56 బంతుల్లో, 7 ఫోర్లు, 13 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకు పడడంతో బళ్లారి టస్కర్స్ 17 ఓవర్లలో 3 వికెట్లను 203 పరుగులు చేసింది. కెపిఎల్ లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే అతడు 106 రాబ్స రాబట్టాడు.

ఇక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు 13 నమోదు కావడం ఇదే తోలిసారి. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 17 ఓవరకు కుదించారు. ప్రత్యర్థి బౌలర్లపై యువ ఆల్‌రౌండర్‌ ఎదురుదాడికి దిగడంతో లయన్స్ టీం భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన షిమోగాని గౌతమ్ బంతితో తిప్పేశాడు.