IPL: లక్నో- గుజరాత్ ఢీ..అరంగేట్రంలో అదరగొట్టేది ఎవరు?

0
89

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి. అహ్మదాబాద్ జట్టుని రూ.5625 కోట్లకి సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని రూ.7090 కోట్లకి ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చేజిక్కించుకుంది. దాంతో.. ఇకపై 10 జట్లతో ఐపీఎల్ జరగనుంది.

ఈరోజు గుజరాత్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ జట్లు తలపడబోతున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభంకానుంది. లఖ్​నవూకు కేఎల్​ రాహుల్, గుజరాత్ కు హార్దిక్​ పాండ్య సారథులుగా వ్యవహరిస్తున్నారు.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

కెప్టెన్‌.. వికెట్‌ కీపర్‌.. ఓపెనర్‌.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే ఆటగాడు ఓ వైపు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అదరగొట్టే ఆల్‌రౌండర్‌ మరోవైపు.. మణికట్టుతో మాయ చేస్తున్న స్పిన్నర్‌ ఇంకోవైపు.. ఇలా మెగా వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

హోల్డర్‌, కృనాల్‌ పాండ్య, దీపక్‌ హుడాల ఆల్ రౌండర్ల త్రయం.

పేసర్‌ అవేశ్‌ ఖాన్‌

ప్రమాదకర డికాక్‌, లూయిస్‌, దుష్మంత చమీర ఉండడం.

పేసర్‌ మార్క్‌ వుడ్‌ సీజన్ మొత్తానికి దూరమవ్వడం దెబ్బె.

గుజరాత్:

రూ.15 కోట్లు వెచ్చించి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను దక్కించుకున్న టైటాన్స్‌.. అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (రూ.15 కోట్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (రూ.8 కోట్లు) లాంటి ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేసింది.

పేసర్లు ఫెర్గూసన్‌, మహ్మద్‌ షమి, ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాతియా

మిల్లర్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌ లాంటి హిట్టర్లు ఉండడం

రషీద్‌, జోసెఫ్‌, షమి పేస్ త్రయం.

జేసన్‌ రాయ్‌ లీగ్‌ నుంచి తప్పుకోవడం