బలమైన జట్టు విజయాల జట్టు అని ముంబై ఇండియన్స్ మరోసారి నిరూపించుకుంది, ఫైనల్ కు వెళ్లి సరైన ప్లానింగ్ తో అదరగొట్టారు ముంబై ఆటగాళ్లు, అద్బుతమైన ఆటతీరుతో ముంబయి ఇండియన్స్ ఐదో సారి ఐపీఎల్ చాంపియన్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ముంబయి జట్టు దిల్లీ కేపిటల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆదినుంచి బాదుడు స్టార్ట్ చేసిన ముంబై చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది, హిట్టర్ రోహిత్ మరోసారి విజృంభించాడు, ఇక ఇంకా 8 బాల్స ఉండగానే విజయం తమ ఖాతాలో వేసుకున్నారు ఆటగాళ్లు
68 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుని విజయం దిశగా నడిపించాడు.. తనకు ఓపెనర్ క్వింటన్ డికాక్ 20 పరుగులు చేసి బాగానే ఆడినా ఓ బంతి అతనిని పెవిలియన్ కు చేర్చింది.
51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన రోహిత్ అనిచ్ నాట్జే బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి లలిత్ యాదవ్కు క్యాచ్ ఇచ్చాడు. ఇక తర్వాత పోలార్డ్ కూడా ఉన్న కొద్దిసేపు అదరగొట్టాడు, ఇక ఇషాన్ కిషన్ 33 తో నాటౌట్ గా నిలిచాడు
157 పరుగుల లక్ష్యం ఇచ్చిన దిల్లీ చివరకు ఓటమి పాలైంది. మొదటిసారి చాంపియన్ అవుతుంది అని అందరూ ధిల్లీపై ఆశలు పెట్టుకున్నారు, కాని ముంబై మాత్రం ట్రోపీ చేజిక్కించుకుంది.