విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం’. బుధవారం విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది.
తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. గీత గోవిందం ఒక విన్నర్. సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక అద్భుతంగా నటించారు.
సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో స్పెషల్‌గా చెప్పుకోదగ్గ వ్యక్తులు. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’’ అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది చూసిన వెన్నెల కిషోర్ ఫుల్ ఖుషీ అయ్యాడు. ‘‘ఈ రోజును నాకు చాలా ప్రత్యేకంగా మార్చారు సార్. మిలియన్ థాంక్స్ మీకు. రియల్లీ స్వీట్ ఆఫ్ యు’’ అంటూ నమస్కారం పెడుతున్న ఎమోజీతో తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.