మహేశ్ బాబు 25వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ఆగస్ట్ 9న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆడియెన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతూ ఒక్కొక్క అక్షరాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆర్.. ఐ… ఎస్ అనే మూడు అక్షరాలను విడుదల చేశారు.
దీంతో మహేశ్ టైటిల్ `రిషి` అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తన్న ఈ చిత్రంలో.. మహేశ్ మూడు షేడ్స్‌లో కనిపించబోతున్నారు. అల్లరి నరేశ్ మహేశ్ ఫ్రెండ్ రోల్‌లో కనిపిస్తారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి నిర్మాతలు. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.