రీమేక్ ఈ మాట చిత్ర సీమకు కొత్త ఏమీ కాదు.. మన దేశంలో అనేక సినిమా పరిశ్రమలు ఉన్నాయి ఓ చోట హిట్ అయిన కథని మరో భాషలో రీమేక్ చేయడం ఏనాటి నుంచో ఉంది. మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ సినిమాలు చేశారు పలు సూపర్ హిట్ రీమేక్స్ చేశారు, మరి చిరు కెరియర్లో రీమేక్ చిత్రాలు ఏమున్నాయి అనేదానిపై ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం లూసీఫర్ మలయాళం చిత్రం తెలుగులో చేయనున్నారు
ఇక తమిళంలో వేదాలం అజిత్ చేశారు ఇది తెలుగులో చేయనున్నారు చిరు
ఖైదీ నంబర్ 150 ఇది తమిళంలో కత్తి సినిమాగా వచ్చింది విజయ్ చేశారు
శంకర్ దాదా జిందాబాద్ – లగే రహో మున్నాభాయ్ బాలీవుడ్ లో ముందు వచ్చింది ఈ చిత్రం
శంకర్ దాదా M.B.B.S |– హిందీలో మున్నాభాయ్ MBBSగా ముందు వచ్చింది
హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్టోరీని లైన్ గా తీసుకుని అంజి సినిమా తీశారు
తమిళంలో వచ్చిన రమణ సినిమా తెలుగులో ఠాగూర్ గా వచ్చింది
హలీవుడ్ లో వచ్చిన ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్ ఇది మృగరాజుగా తీశారు
తమిళంలో వచ్చిన నట్పుక్కగ సినిమా తెలుగులో స్నేహం కోసంగా తీశారు
మలయాళంలో హిట్లర్ సినిమాని తెలుగులో హిట్లర్ గా తీశారు
వాల్టర్ వెట్రివేల్ తమిళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో SP పరశురాం గా వచ్చింది
కన్నడలో వచ్చిన అనురాగ అరాలితు సినిమా ఘరానా మొగుడుగా తీశారు
మై డియర్ మార్తాండన్ తమిళ్ లో వచ్చింది ఈ చిత్రం తెలుగులో రాజా విక్రమార్కగా తీశారు
పూవిన్ను పుతియా పుంతెన్నెల్ సినిమా మలయాళంలో వచ్చింది దీనిని తెలుగులో పసివాడి ప్రాణంగా తీశారు.