ప్రస్తుత జట్లలో టీమిండియా బౌలింగే బెస్ట్

ప్రస్తుత జట్లలో టీమిండియా బౌలింగే బెస్ట్

0
113

ఇప్పటి వరకు తాను ఎదుర్కొన్న బౌలింగ్ లో టీమిండియా బౌలింగే బెస్ట్ బౌలింగ్ అని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నాడు. ‘ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. కానీ బంతి ప్రతిసారీ ఏదో ఒకటి చేస్తుంది. అందుకోసమే నేను ఎక్కువ సేపు ఆడాను. టీమిండియా బౌలర్లు బంతిని బాదే అవకాశం ఇవ్వలేదు. అందుకే బ్యాటింగ్ చేశాను. ఈ మ్యాచ్‌లో ఆడిన విధంగానే అన్ని సార్లు ఆడలేను. కానీ మేము ఒక మంచి స్థానంలో ఉన్నాం’ అని అలీ తెలిపాడు.

తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న కుక్ ఈ మ్యాచ్‌లో 71 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్ జెన్నింగ్స్‌తో కలిసి మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. 37 పరుగుల వద్ద ఒక లైఫ్ లభించిన కుక్ అర్ధ శతకం చేసి టీ బ్రేక్ తర్వాత ఔటయ్యాడు. కుక్, అలీ కలిసి రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ‘ క్యాచ్ చేజారినప్పుడు అది మీ కోసమే అని కుక్‌కు చెప్పాను. కుక్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అది చాలా కష్టం’ అని అలీ వివరించాడు.