మహేంద్ర సింగ్ ధోనీ నెక్ట్స్ ఏం చేయబోతున్నారో తెలిస్తే శభాష్ అంటారు

మహేంద్ర సింగ్ ధోనీ నెక్ట్స్ ఏం చేయబోతున్నారో తెలిస్తే శభాష్ అంటారు

0
103

కూల్ కెప్టెన్, మహేంద్రసింగ్ ధోని అన్నీ ఫార్మెట్లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు, ఇక ఐపీఎల్ లో మాత్రమే ఆయన కనిపించనున్నాడు. అయితే కనీసం మరో రెండు సీజన్ల పాటు ఐపీఎల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది,

సో వాట్ నెక్ట్స్ అనేది చూస్తే ధోనికి చాలా ప్లాన్స్ ఉన్నాయి అంటున్నారు.క్రికెట్ కారణంగా ఇంటర్ తోనే చదువును ఆపేసిన ధోనీ, దాన్ని కొనసాగించాలని భావిస్తున్నారట, అంతేకాదు, గతంలో
2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆయన డిగ్రీలో చేరారు, అది మధ్యలోనే ఆగిపోయింది దానిని పూర్తి చేయాలి అని ఆలోచిస్తున్నారు.

అలాగే నవంబర్ 2011లో ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో గౌరవ ఉద్యోగం లభించింది. ఇప్పటికే ధోనీ పలుమార్లు సైనిక కార్యకలాపాల్లోనూ పాల్గొన్నారు. ఇక కొంతకాలం ఆర్మీలో కూడా సేవ చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు అని తెలుస్తోంది. ఐపీఎల్ తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుంది, అంతేకాదు కోచ్ గా అకాడమి స్టార్ట్ చేసి.మరింత మందిని క్రికెటర్లను తయారు చేసే ఆలోచన చేయాలి అని అభిమానులు కోరుతున్నారు.