ధోనీ ఆదాయం అతని ఆస్తులు కార్లు బైక్స్ విమానం మొత్తం ఎంతో తెలుసా

ధోనీ ఆదాయం అతని ఆస్తులు కార్లు బైక్స్ విమానం మొత్తం ఎంతో తెలుసా

0
107

ఎంఎస్ ధోనీ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్ అయ్యారు, ఇంత సడెన్ గా ధోని నిర్ణయం తీసుకుంటాడు అని ఎవరూ ఊహించలేదు, అయితే ఈ సమయంలో ధోని గురించి పలు విషయాలు తెలుసుకుంటున్నారు అభిమానులు, అయితే ధోనీ క్రికెట్ ద్వారా వచ్చే వేతనంతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా అంతకంటే ఎక్కువ సంపాదించాడు.

మొత్తం అతనికి ఏడాదికి ఆదాయం 100 కోట్ల వరకూ ఉంటుంది అని అంచనా, అంతేకాదు పలు యాడ్స్ ఇప్పటికీ ఆయన కంటిన్యూ చేస్తున్నారు, మరో రెండేళ్ల వరకూ ఇంకా ధోనికి పలు యాడ్స్ ఉంటాయి.
నెట్ ఆదాయం రూ.760 కోట్ల నుండి రూ.830 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా అయితే ఉంది.

ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ శాలరీ రూ.15 కోట్లుగా ఉంది. టీ20 మ్యాచ్ ఫీజు రూ.2 లక్షలు. పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.620 కోట్లుగా తెలుస్తోంది.అంతేకాదు మిస్టర్ కూల్ కు కార్లు బైక్స్ అంటే చాలా ఇష్టం
ఖరీదైన కార్లు బైక్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ విమానం కూడా ఉంది..లగ్జరీ కార్ల వ్యాల్యూ రూ.12.5 కోట్లుగా ఉంది.

అలాగే ధోని 2011లో డెహ్రూడాన్లో లగ్జరీ హోమ్ తీసుకున్నాడు. దాని వ్యాల్యూ రూ.17.8 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక రియల్ ఎస్టేట్ ప్రొపర్టీస్ ఉన్నాయి, ఖరీదైన విల్లాలు భవనాలు ఉన్నాయి,
హమ్మర్, ఆడి, మెర్సిడెజ్, మిత్సుబిషి పెజెరో, రేంజ్ రోవర్ ఇలాంటి ఖరీదైన కార్లు స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి.హాకీ, ఫుట్బాల్, కబడ్డీ వంటి విభిన్న క్రీడల్లో పలు జట్లకు సహయజమానిగా కూడా ఆయన సంపాదిస్తున్నారు.