ముంబయి కెప్టెన్ రోహిత్‌ శర్మకు భారీ జరిమానా..కారణం ఇదే?

0
102

ఐదు సార్లు చాంపియన్స్ ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్ లో అధ్వాన్నంగా మారింది.  తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోను కూడా ఓడిపోయింది. అసలే ఐదు మ్యాచ్ లలో ఓడిపోయి బాధలో ఉంటే.. ఆ బాధ నుండి కోలుకోక ముందే ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కు భారీ షాక్ తగిలింది.

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌ లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రోహిత్‌ కు 24 లక్షల జరిమానా విధించారు. అంతకు ముందు ఈ సీజన్​లో మార్చి 27న తొలి మ్యాచ్​ క్యాపిటల్స్​పై ముంబై ఇండియన్స్​ ఆడింది. ఆ మ్యాచ్ లో కూడా స్లో ఓవర్​ రేటు కారణంగా ముంబైకి 12 లక్షల జరిమానా పడింది.

ఇక మూడోసారి అదే తప్పు చేస్తే మాత్రం కెప్టెన్‌కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధిస్తారు. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. కాబట్టి రోహిత్ శర్మ స్లో ఓవర్ రేట్ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.