IPL: మరో కప్పు కోసం ముంబై ఇండియన్స్ తహతహ? రోహిత్ సేన బలాలు, బలహీనతలు ఇవే..

0
122

మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్సే. టోర్నీ చరిత్రలోనే ఆ జట్టు అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ గెలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంలోని ఆ జట్టు.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌‌ను శాసిస్తోంది. ఈనెల 27న బ్రబోర్న్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనున్నది. ఈ నేపథ్యంలో ముంబై జట్టు బలం, బలహీనతల గురించి ఓ లుక్కేద్దాం..

మెగా వేలం ముందు ముంబై జట్టు రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్  (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు) లను రెటైన్ చేసుకుంది. ఇషాన్ కిషన్ ను వేలంలో తిరిగి కొనుక్కొని జట్టు బలాన్ని పెంచింది. ముంబై హెడ్ కోచ్ – మహేళ జయవర్దనె,
జహీర్ ఖాన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్, షేన్ బాండ్ బౌలింగ్ కోచ్, రాబిన్ సింగ్ బ్యాటింగ్ కోచ్,  జేమ్స్ పమ్మెంట్ : ఫీల్డింగ్ కోచ్, పాల్ చాంప్మన్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ జట్టుకు మంచి స్టాఫ్ దొరికింది.

అలాగే డేవాల్డ్ బ్రెవిస్ (రూ. 3 కోట్లు), బసిల్ తంపి (రూ. 30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ. 1.6 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.3 కోట్లు), మయాంక్ మార్కండె (రూ. 1.6 కోట్లు), ఎన్. తిలక్ వర్మ (రూ. 1.70 కోట్లు), సంజయ్ యాదవ్ (రూ. 50 లక్షలు), జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు), డానియల్ సామ్స్ (రూ. 2.60 కోట్లు), టైమల్ మిల్స్ (రూ. 1.50 కోట్లు), రిలీ మెరెడిత్ (రూ. 1 కోటి), మహ్మద్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు),  అన్మోల్ ప్రీత్ సింగ్ (రూ. 20 లక్షలు), రమన్ దీప్ సింగ్ (రూ. 20 లక్షలు), రాహుల్ బుద్ది (రూ. 20 లక్షలు), హృతిక్ షోకీన్ (రూ. 20 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), ఆర్యన్ జుయల్ (రూ. 20 లక్షలు), ఫబియన్ అలెన్ (రూ. 75 లక్షలు) పెట్టి కొనుగోలు చేసింది.

బలం: 

రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

బలహీనత:

ఎన్నడూ లేని విధంగా పేపర్‌పై ముంబై ఇండియన్స్ బలహీనంగా కనిపిస్తోంది. జట్టులో పేరుమోసిన ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. పైగా జట్టులో సగానికిపైగా కుర్రాళ్లే ఉన్నారు. దాంతో రోహిత్ సేన ఐపీఎల్ 2022 భవితవ్యం కుర్రాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. అయితే అనామక ఆటగాళ్లను స్టార్లుగా మార్చడం ముంబైకి కొత్తేం కాదు. అంతేకాకుండా లీగ్ మొత్తం ముంబైలోని జరుగుతుండటం టీమ్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది.