అబుదాబిలో సూర్య కుమార్ యాదవ్ ఆటతో అదరగొట్టాడు, వన్ మ్యాన్ షోతో ముంబై జట్టును విజయానికి తీసుకువెళ్లాడు, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది ముంబై ఇండియన్స్ …బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది ముంబైసేన.
బ్యాటింగ్ తొలుత చేసి బెంగళూరు 165 పరుగులు కొట్టింది, సూర్యకుమార్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ 25, డికాక్ 18, హార్దిక్ పాండ్యా 17, కృనాల్ పాండ్యా 10, సౌరబ్ తివారి 5, పొలార్డ్ 4 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు జట్లు డీలా పడింది.
సూర్య కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఓపక్క వికెట్లు పడుతున్నా తన బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు..టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కొహ్లీ సేన ఆఖరి ఓవర్లలో చేతులెత్తేసింది,
ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు 8 మ్యాచ్లు గెలిచింది. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.