కోహ్లిని ఔట్ చేయడం నా కల..వరల్డ్‌ టీ20 నెం1 బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

My dream is to get rid of Kohli..World T20 No.1 bowler‌ Interesting comments

0
329

ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది బౌలర్లు భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లి వికెట్‌ ఒక్క సారైనా సాధించాలని కలలు కంటుంటారు. ఈ లిస్ట్‌లో వరల్డ్‌ టీ20 నెం1 బౌలర్‌ వనిందు హసరంగా కూడా ఉన్నాడు.

విరాట్ కోహ్లి వికెట్ పడగొట్టడం తన కల అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హసరంగా పేర్కొన్నాడు. అతడు ఐపీఎల్ 2021లో ఆర్సీబీ తరుపున ఆడిన సంగతి తెలిసిందే. అయితే ప్రాక్టీస్‌ చేసే సమయంలో కూడా విరాట్‌ వికెట్‌ సాధించలేక పోయాను అని హసరంగా తెలిపాడు. కోహ్లి తర్వాత పాక్ కెప్టెన్‌ బాబర్ ఆజాం కూడా తన లిస్ట్‌లో ఉన్నారు.

నా అభిమాన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ పడగొట్టడం​ నా కల. అదే విధంగా బాబర్ ఆజం, గ్లెన్ మాక్స్‌వెల్‌ల వికెట్లను కూడా తీయాలనుకుంటున్నాను. నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు.. ఎప్పుడూ వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాను. నేను జాతీయ జట్టుకు ఆడినప్పుడు..జట్టు విజయం కోసం నా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తాను.

నేను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొను, నా పని నేను పూర్తి చేస్తాను  మురళీధరన్ ,హెరాత్‌ల ను ఆదర్శంగా తీసుకున్నాను. కానీ ఏ రోజు తదుపరి మురళీధరన్ లేదా తదుపరి హెరాత్ అవ్వాలనుకోలేదు. నేను నాలానే ఉండాలి అనుకుంటున్నానని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన హసరంగా 16 వికెట్లు పడగొట్టాడు.